ఏపీకి మూడు రాజధానులు రావచ్చంటూ అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటనను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అమరావతిలో ఒక వర్గానికి చెందిన రైతులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను చంద్రబాబు రెచ్చగొడుతూ ఆందోళన చేయిస్తుంటే..పవన్ కల్యాణ్ వారికి మద్దతు పలుకుతూ వివాదాన్ని మరింత రగిలిస్తున్నాడు. మూడు రాజధానులపై ఒక్క అమరావతి ప్రాంతం మినహా మిగతా రాష్ట్రమంతా మద్దతు పలుకుతుందని తెలిసినా…బాబు, పవన్‌లు ఆందోళనలు చేయిస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా మూడు రాజధానుల విషయంపై చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు వ్యవహరిస్తున్న తీరుపై కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మండిపడ్డారు. డిసెంబర్ 23 న నియోజకవర్గంలోని దామరమడుగు, రేబాల, జొన్నవాడ గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పలు అభివృద్ధిపనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు మూడు రాజధానుల విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, అసలు ఇద్దరు పిచ్చోళ్లతో అనర్థమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల అభిప్రాయాన్ని శాసనసభలో తెలిపారన్నారు. దీనిపై చంద్రబాబు, అతను ఇచ్చే సూట్‌కేసులకు అమ్ముడుపోయిన పవన్‌కల్యాణ్ రాజధాని ప్రజలను రెచ్చగొట్టి గందరగోళం సృష్టిస్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజధాని మారితే అక్కడ ప్రజలు భూములను దోచుకున్న చంద్రబాబు అండ్ కో నేతలకు నష్టమని ఏవేవో మాట్లాడుతున్నారన్నారని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అన్ని ప్రాంతాల సమస్యలను తెలుసుకున్నారని, వాటన్నింటిని అభివృద్ధి చేయాలనే సీఎం మూడు రాజధానులను ప్రకటించినట్లు నల్లపురెడ్డి వివరించారు. మొత్తంగా మూడు రాజధానుల విషయంలో రాద్ధాంతం చేస్తున్న పార్టనర్లు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.
Tags andhrapradesh Chandrababu kovuru mla nallapureddy prasannakumar reddy Pawan Kalyan politics Sensational Comments three capitals issue viral
Related Articles
నువ్వు హీరోవా….రౌడీవా…బొచ్చులోది…గెటవుట్…బాలయ్యపై టాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..!
September 23, 2023
.జైలు నుంచే బాలయ్యకు చంద్రబాబు వెన్నుపోటు..బ్రాహ్మణి భజన చేస్తున్న పచ్చ సాంబడు..!
September 23, 2023
జడ్జి హిమబిందుపై టీడీపీ నేతల కారుకూతలపై రాష్ట్రపతి భవన్ సీరియస్..కఠిన చర్యలకు ఆదేశాలు..!
September 23, 2023
నీ బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అయితే మాకేంటీ..ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ..జాగ్రత్త బాలయ్య..!
September 21, 2023
వైఎస్సార్సీపీ గుర్తు అయినంత మాత్రాన జైలులో ఫ్యాన్ వాడకుంటే దోమలు కుట్టవా బాబుగారు..!
September 21, 2023
చంద్రబాబు జైలుకు వెళితే..టాలీవుడ్‌కేం సంబంధం..”కమ్మ”గా కళ్లు తెరిపించిన సురేష్ బాబు..!
September 19, 2023
హైదరాబాద్‌లో టీడీపీ కమ్మోళ్లే కాదు..జగన్ ఫ్యాన్స్ కూడా ఉన్నారబ్బా..దెబ్బకు దెబ్బ అంటే ఇదే..!
September 19, 2023
జగన్ కేసీఆర్‌లపై ప్రశంసలు..పవన్, బాబుకి అక్షింతలు..మంట పుట్టిస్తున్న జేడీ ట్వీట్స్..!
September 16, 2023
చంద్రబాబుకు మళ్లీ షాక్ ఇచ్చిన ఏసీబీ కోర్డ్..రెండు బెయిల్ పిటీషన్లు కూడా వాయిదా..!
September 15, 2023
జూనియర్ ఎన్టీఆరా..వాడో ఓ పిల్ల సైకో…కులపోళ్లతో తిట్టిస్తున్న పచ్చమీడియా..ఇది నారా కుట్ర..!
September 15, 2023
ఏఏజీ పొన్నవోలుని చెప్పుతో కొట్టిస్తా..నా కొడకా..అని తిట్టించిన టీవీ 5 పచ్చ సాంబడు..!
September 15, 2023