ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం చేసిన ప్రకటనపై రాష్ట్రమంతటా హర్షం వ్యక్తమవుతుండగా…అమరావతి ప్రాంతంలో మాత్రం ఆందోళనలు జరుగుతున్నాయి. మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా అమరావతిలో బాబుగారి సామాజికవర్గానికి చెందిన కొంతమంది రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబుకు “కమ్మ”గా వంతపాడే ఎల్లోమీడియా ఛానళ్లు, పత్రికలు అమరావతిలో జరుగుతున్న ఈ ఆందోళనల కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తున్నాయి. తాజాగా బాబుగారి రాజగురువు పత్రికలో ప్రాణాలైన అర్పిస్తాం..రాజధానిని వదులుకోం..ఇకనైనా కళ్లు తెరవండి..నిర్ణయాన్ని మార్చుకోండి…ప్రభుత్వానికి అమరావతి రైతుల హితవు అంటూ ఓ కథనం వచ్చింది. తుళ్లూరులో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న రైతులు..ప్లకార్డుతో ఓ యువతి ప్రదర్శన అంటూ బుల్లెట్ పాయింట్స్తోపాటు.. ధర్నా చేస్తున్న వారి ఫోటోను ఆ కథనంలో ప్రచురించింది. అయితే ఆ ఫోటోలో రైతులకు బదులుగా ఎక్కువగా విద్యార్థులు, యువతీ, యువకులే ఉన్నారు. తాజాగా ఈ కథనంపై ప్రముఖ క్రిటిక్ కత్తి మహేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఇంతమంది పిల్లలు యువకులు,మోడ్రన్ యువతులు రాజధానిలో రైతులని నాకు తెలీదు. వ్యవసాయం ఆధునీకరించబడింది అని ఈ ఫోటో చూస్తుంటే తెలుస్తోంది…జై తెలుగుదేశం…అంటూ కత్తి మహేష్ సెటైర్ వేశాడు. దీన్ని బట్టి అమరావతిలో రైతుల ముసుగులో తెలుగు దేశం పార్టీనే ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతుందని పచ్చపత్రిక వేసిన కథనంతోనే బయటపడిపోయింది. ప్రస్తుతం పచ్చ పత్రిక కథనంపై కత్తి మహేష్ వేసిన సెటైర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
