ప్రముఖ హీరో మోహాన్‌బాబు కుమారుడు మంచు విష్ణు స్కూల్స్, ఆఫీసులపై జీఎస్టీ అధికారులు దాడులు చేశారు. ప్రభుత్వానికి కట్టాల్సిన టాక్స్ కట్టకుండా స్కూల్స్ నడుపుతున్నారని తమ దృష్టికి రావటంతో ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. మంచు విష్ణు స్ప్రింగ్‌బోర్డ్ అకాడమితో పాటు చిరాక్ స్కూల్‌ను నడుపుతున్నట్లు తెలుస్తోంది. మంచు ఫ్యామిలీ చాలా రోజుల నుండి విద్యాసంస్థలు నడుపుతున్న విషయం అందరికీ తెలిసిందే.
జీఎస్టీ రాకముందు, వచ్చిన తర్వాత కూడా పన్ను చెల్లింపులు సరిగ్గా చేయటం లేదని, అందుకే మల్కాజ్‌గిరి, ఖైరతాబాద్, బంజారాహిల్స్, బేగంపేట్, లింగంపల్లి సహా మొత్తం 20చోట్ల సోదాలు నిర్విహించినట్లు తెలుస్తోంది. జీఎస్టీ అధికారుల సమాచారం ప్రకారం దాదపు 40 కోట్లు రూపాయాల లెక్క చూపని మొత్తాన్ని గుర్తించినట్లు అనధికారికంగా తెలిపారు.