యావత్ భారత్ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న వివిధ పథకాలు పలురాష్ర్టాలకు రోల్‌మోడల్‌గా ఉందని ఆయన పేర్కొన్నారు. బుధవారం సనత్‌నగర్ నియోజక వర్గంలో క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్న సంకల్పంతోనే కేసీఆర్ అన్ని పండుగలను ప్రభుత్వం తరపున నిర్వహిస్తున్నారని అన్నారు. అన్ని మతాల పండగలను ప్రభుత్వమే నిర్వహించే చరిత్ర దేశంలో ఎక్కడాలేదని మంత్రి తలసాని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే గిఫ్ట్ప్యాకెట్ల పంపిణీతోపాటు క్రిస్మస్ విందుకూడా ఏర్పాటుచేస్తున్నామని అన్నారు.