ఏపీ అధికార వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సలహాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ” దిశ చట్టం గురించి గొప్పగా వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. కానీ ఆ పార్టీలో కొంతమంది పలు ఆరోపణలను ఎదుర్కుంటున్నారు.
వాళ్లపై దిశ చట్టం ప్రకారం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అని ప్రశ్నించారు. మమ్మల్ని బపూన్లు అని అంటున్న సీఎం జగన్ తానెంటో తెలుసుకోవాలి.. తమపై దాడులు చేయించి జగన్ ఆనందపడుతున్నారు”అని ఆయన అన్నారు.