ప్రస్తుతం ఉన్న ఆధునీక పరిస్థితుల నేపథ్యం.. బిజీ బిజీ లైఫ్ స్టైల్ ఉండటం కారణంగా మనలో చాలా మంది ఏదో కొంపలు కాలిపోతున్నట్లు చాలా వేగంగా భోజనం తింటుంటారు.
అంత వేగంగా ఎందుకు తింటున్నారు అని అడిగితే అర్జెంట్ పని ఉందనో.. ఏదో ఏదో కారణాలు చెప్తారు. అయితే అలా వేగంగా తింటే నష్టాలున్నాయంటున్నారు పరిశోధకులు.
మరి ఏమి ఏమి నష్టాలుంటాయో ఒక్కసారి తెలుసుకుందాం.
* వేగంగా భోజనం చేసేవారు ఎక్కువగా బరువు కూడా పెరుగుతారు
* బరువు పెరుగుతారు కాబట్టి నెమ్మదిగా భోజనం తినాలని పరిశోధకులు చెబుతున్నారు
*వేగంగా భోజనం చేయడం వలన తిన్నది జీర్ణం కాదు
* ఆహారం జీర్ణమయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది కానీ మనం వేగంగా తినడం వలన జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బ తింటుంది
*శరవేగంగా భోజనం చేయడం వలన ఇన్సులిన్ నిరోధకత పెరిగి టైప్ 2 డయాబెటిస్ వస్తుంది
* చాలా త్వరగా ఆహారం తినడం వలన గ్యాస్,అసిడిటీ లాంటి సమస్యలు కూడా వస్తాయి