దర్బార్ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. దర్బార్ ఆడియోను కూడా ఇటీవలే రిలీజ్ చేశారు. ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మాములుగా ఆడియో వేడుక సమయంలోనే ట్రైలర్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కానీ, దర్బార్ విషయంలో దానికి విరుద్ధంగా చేస్తున్నారు. ముందుగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఆ తరువాత ఆడియో వేడుకను నిర్వహించి ఆడియోను రిలీజ్ చేశారు.
ఆల్బమ్ కు మంచి పేరు రావడంతో ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ రేపు రిలీజ్ కాబోతున్నది. ఇందులో రజినీకాంత్ ఆదిత్య అరుణాచలం అనే పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ గా రజినీకాంత్ నటించి పాతికేళ్ళు అయ్యింది. కాగా, పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రజినీకాంత్ తన పంజా విసరబోతున్నారు. రేపు రిలీజ్ కాబోయే ట్రైలర్ కోసం యావత్ రజిని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నయనతార హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.