Home / ANDHRAPRADESH / జనసేన ఎమ్మెల్యే రాపాక పార్టీ మారతారా.. ?

జనసేన ఎమ్మెల్యే రాపాక పార్టీ మారతారా.. ?

రాపాక వరప్రసాద్ జనసేనకు ఉన్న ఒకే ఒక ఎమ్మేల్యే. ఈ మద్య రాపాక పార్టీ మారతారంటు తెగ ప్రచారం జరుగుతోంది. ఈ విషయం పై సోషల్ మీడియాలో పోస్ట్ లు దర్శనమిస్తున్నాయి. ఇలాంటి వార్తల పై జనసేన ఎమ్మేల్యే రాపాక వరప్రసాద్ స్పందించారు. ప్రస్తుతానికి తనకు పార్టీ మారే ఆలోచన లేదని ,అదంతా గిట్టని వారు చేసే ప్రచారమని ఆయన కొట్టిపారేసారు. ప్రభుత్వం ఏ మంచి పని చేసినా అభినందిస్తానని, ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే ప్రశ్నిస్తానన్నారు జనసేన ఎమ్మేల్యే.

ఏ రాజకీయ పార్టీ అయిన ప్రజల కోసమే పుడుతుందని, ఒక వేళ స్వార్ధం కోసం వస్తే దానికి భవిష్యత్తు ఉండదన్నారు.. జనసేన పార్టీకి భవిష్యత్ ఉండాలంటే గ్రౌండ్ లెవల్ నుండి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, గ్రామస్థాయిలో,మండలస్థాయిలో,జిల్లా స్థాయిలలో పార్టీకి కమిటీలు లేవని, దీని వల్ల గ్రౌండ్ స్థాయిలో కార్యకర్తలు పార్టీకి లేరన్నారు జనసేన ఎమ్మేల్యే. ఈ కారణం వల్లనే అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయామని ఆయన అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాన్ మీటింగ్ లు పెడితే జనం బాగా వస్తున్నారని కానీ ఎలక్షన్స్ లో జనసేన అభ్యర్థులు గెలవకపోవడానికి కారణం.. గ్రౌండ్ లెవల్ లో ఇంకా పార్టీకి బలమైన కార్యకర్తలు లేకపోవడం కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.పవన్ కళ్యాణ్ జనసమస్యల పై నిరంతరం తిరుగుతే ప్రయోజనం ఉంటుందని, నెలకోసారి తిరిగితే మాత్రం పార్టీ భవితవ్యం కష్టమన్నారు. ప్రస్తుతానికి ఇద్దరి మధ్య మంచి సంబందాలు ఉన్నాయని,పార్టీ మారే ఆలోచన మాత్రం లేదని ఒక ఇంటర్వ్యలో రాపాక తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat