కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలకు కారణమవుతోంది. ఈ బిల్లును కొన్ని రాష్ట్రాల సీఎం లు కూగా విమర్శిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనార్జీ అయితే ఈ బిల్లును నా రాష్ట్రంలో అమలు చేయనని తెగేసి చెప్పతోంది. ఈ బిల్లుకు భయపడోద్దు మేం మీతో ఉంటామని మమత స్పష్టం చేసింది. దేశంలో మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని బిజేపి ప్రభుత్వం ఇలాంటి బిల్లులు తీసుకొస్తుందని ఆమె విమర్శులు గుప్పించింది.
కేరళ ముఖ్యమంత్రి పినరన్ విజయన్ కూడా ఈ పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నారు.రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కేంద్రప్రభుత్వం కాలరాస్తోందని ఆయన కేంద్రప్రభుత్వ నిర్ణయాలను విమర్శించారు. రాజ్యాంగ విరుద్ధమైన ఇలాంటి చట్టానికి తమ రాష్ట్రంలో చోటు లేదన్నారు. భారతీయులందరికీ భారత రాజ్యాంగం సమాన హక్కులు ఇచ్చిందని, కానీ పౌరసత్వ సవరణ బిల్లు ఇక్కడ వారి హక్కులను హరిస్తుందని ఆయనన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ లో కూడా ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ ఈ కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. రాజ్యాంగ విరుద్దమైన ఈ బిల్లును రాష్ట్రంలో అడ్డుకుంటామని ఆయన చెప్పారు. భారతదేశంలోని ప్రజలను మతపరమైన మార్గాల్లో విభజించడానికి ప్రయత్నించే ఏ చట్టమైన అది చట్టవిరుద్ధం, అనైతికమైనదని సీఎం అమరేందర్ సింగ్ అన్నారు. ఇలా ఇప్పటికే మూడు రాష్ట్రాల సీఎంలు తమ రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నారు.