కొమురవెల్లి మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవం, బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కొమురవెల్లి ఆలయ అధికారులు అర్చకులు అహ్వానించారు .
హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో మంత్రిని కలిసి అహ్వాన పత్రికను,ప్రసాదాన్ని అందజేశారు. ఈ నెల 22 నుంచి మార్చి 23 2020 వరకు జరిగే స్వామి కళ్యాణ మహోత్సవం, బ్రహ్మోత్సవాల్లో పాల్గోనాలని మంత్రిని కోరారు. మంత్రిని కలిసిన వారిలో కొమురవెల్లి ఈవో వెంకటేష్ ఏఈవో సుదర్శన్ అర్చకులు తదితరులు ఉన్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన కొమురవెల్లిలోని మల్లికార్జుని క్షేత్రంలోఈ నెల 22 నుండి శ్రీ మల్లికార్జునుడి కల్యాణంతో మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న తరుణంలో ఆలయాన్ని దేవాదాయ అధికారులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.