ఎన్నికలకు ముందు చిత్రవిచిత్ర వ్యాఖ్యలతో దుందుడుకు ప్రవర్తనతో అరుపులు కేకలతో రచ్చ చేసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా యాక్టింగ్ ఇరగదీస్తున్నరు. తాజాగా సౌభాగ్య దీక్షతో కాకినాడలో దీక్ష ముగించుకుని వెనక్కి వెళ్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానం గంట ఆలస్యం అని రాజమండ్రి ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. అయితే ఎయిర్పోర్టులో కుర్చీలు వీఐపీలకు లాంజ్ లు తదితర ఏర్పాట్లు ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ కావాలనే ఎయిర్పోర్ట్ బయటకు ఓ దిండు తెచ్చుకొని బయట ఓ చిన్న అరుగుపై లైట్ వెలుగులో పడుకున్నారు. ఇది చూస్తున్న ఆయన సిబ్బంది వెంటనే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఒకవైపు విమానాల్లో తిరుగుతూ మరోవైపు ఇలా నేల మీద పడుకొంటారు ఈ డబుల్ యాక్టింగ్ ఎందుకు అంటూ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తున్నారు. పవన్ సహజంగా తాను సామాన్య జీవితం గడపడానికి ఇష్టపడుతుంటారు అని చెప్తున్నారు అయితే వాస్తవ జీవితంలో నువ్వు అలా ప్రవర్తించాలని ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ బెంజ్ కార్ లో ప్రయాణిస్తూ ఇలా నేలపై పడుకుంటే నిన్ను ఎవరు నమ్ముతారు పవన్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు.