టీమిండియా సీనియర్ వికెట్ కీపర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వారసుడిగా జట్టులోకి వచ్చిన యువ కెరటం రిషభ్ పంత్. 22 ఏళ్ల పంత్ బ్యాటింగ్, కీపింగ్‌లలో విఫలమవుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా పంత్ మరోసారి కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచాడు. అయితే ఈసారి వార్తల్లో నిలిచింది మాత్రం క్రికెట్ ఆటతో కాదు. వెస్టిండీస్ తో మూడవ టీ-20 మ్యాచ్ కి ముందు రోజు వికెట్ కీపర్ రిషబ్ పంత్ం బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌతెలా ముంబైలోని ఓ స్టార్ హోటల్ కు కలిసి రావడంతో, వారిద్దరూ డేటింగ్ లో ఉన్నాన్న వార్తలు గుప్పుమన్నాయి. అప్పట్లో హార్దిక్ పాండ్యాతో చెట్టపట్టాలేసుకుని తిరిగిన ఊర్వశి, ఇప్పుడు పంత్ తో జత కట్టిందని నెటిజన్లు అంటున్నారు. దీంతో పంత్ పై విమర్శలూ వస్తున్నాయి. నిలకడ లేక, పేలవమైన షాట్లు ఆడుతూ, జట్టులో స్థానం కోల్పోయే పరిస్థితికి చేరాడని, అందుకు ఇలాంటి డేటింగ్ లే కారణమని అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు క్రికెట్ అభిమానులు పంత్ అమ్మాయిలతో డేటింగ్ చేసుకో ఆట వదిలేయ్ అంటూ నెటిజన్లు మండి పడుతున్నారు.
