ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు,మాజీ మంత్రి నారా లోకేష్ నాయుడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మార్షల్స్ పై బూతులతో విరుచుకుపడ్డారు. అక్కడితో ఆగకుండా ఆన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ లో విరుచుకుపడ్డారు లోకేశ్ .
ఈ రోజు శుక్రవారం ఉదయం చంద్రబాబు నాయుడుతో పాటుగా టీడీపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు అసెంబ్లీ నాలుగో గేటు ద్వారా ప్లకార్డులతో లోపలకు వెళ్లకూడదని మార్షల్స్ చెప్పారు. దీంతో కోపోద్రిక్తులైన చంద్రబాబుతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మార్షల్స్‌తో టీడీపీ సభ్యులు ఘర్షణకు దిగారు.
చీఫ్ మార్షల్ థియోఫిలస్ అక్కడకు చేరుకుని వారికి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా టీడీపీ సభ్యులు వినలేదు.ఆ తర్వాత నారా లోకేష్ నాయుడు మార్షల్స్ ను ఉద్ధేశిస్తూ”‘యూజ్లెస్ ఫెలో.. అన్నం తింటున్నారా.. గడ్డి తింటున్నారా.. జంతువుల్లా ప్రవర్తిస్తారా..?.. బ్లాస్టర్స్ .. మీ అంతు చూస్తా ’ అంటూ మార్షల్స్‌పై తిట్లతో విరుచుకుపడ్డారు. .