గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు రాష్ట్రానికి చేసింది ఏమైనా ఉంది అంటే అది అప్పులు మిగల్చడమే అని చెప్పాలి. ఎందుకంటే సీఎం పదవికోసం ప్రజలను మభ్యపెట్టి, తప్పుడు హామీలు ఇచ్చి, రైతులను నమ్మించి గెలిచాడు. తీరా గెలిచిన తరువాత చేతులెత్తేసాడు. దాంతో ఒక్కసారిగా ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. ఇదేమిటని అడిగితే రాష్ట్రం చాలా అప్పుల్లో ఉందని చెప్పారు. అంత అప్పుల్లో ఉన్నప్పుడు మరి ఎన్నికలకు ముందు పసుపు-కుంకుమ పేరుతో మీరు చేసిందేమిటో మీకే తెలియాలి. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. “సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరు మీద 13,500 కోట్లు అప్పులు తెచ్చి పసుపు-కుంకుమ, పప్పు బెల్లాలకు పంచిపెట్టాడు చంద్రబాబు. ఉల్లి ధరలు పెరిగినా, ఇంకేదైనా నిత్యావసర వస్తువు ధర ఎగిసిపడినా నిధుల కొరతతో కార్పోరేషన్ రంగంలోకి దిగలేని పరిస్థితి సృష్టించి వెళ్లాడు” అని మండిపడ్డారు.
