తెలంగాణ అన్ని మతాల ప్రజల నివాసానికి సముహారంగా నిలుస్తోందని, మైనారిటీ ల ప్రయోజనాలను ప్రస్తుత ప్రభుత్వం పరిరక్షించ గలుగుతుందని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ పరిధిలో చర్చీల్లో క్రిస్టమస్ కానుకల పంపిణి కార్యక్రమం సోమవారం కోలాహలంగా ప్రారంభమైంది.
సితాఫలమంది లో ని చర్చి అఫ్ లేడీ ఆఫ్ పెర్పేతుయాల్ హెల్ప్ లో నిర్వహించిన కానుకల పంపిణి కార్యక్రమంలో పద్మారావు గౌడ్ ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని కులాలు, మతాల వారికి ప్రాముఖ్యతను కల్పిస్తున్నామని, అధికారికంగా ప్రభుత్వం నిధులను కేటాయిస్తోందని వివరించారు.
క్రైస్తవులు జరుపుకొనే క్రిస్మస్ పండుగకు దుస్తులను కానుకగా అందించడం తో పాటు క్రిస్మస్ ఫీస్ట్ నిర్వహణకు చర్చీలకు రూ. లక్ష మేరకు నిధులను సమకురుస్తున్నామని పద్మారావు గౌడ్ వివరించారు. ప్రభుత్వం నిర్వహించే క్రిస్మస్ విందుకు సికింద్రాబాద్ పరిధిలోని చర్చీల నిర్వాహకులు, ప్రతినిధులు హాజరు కావాలని, వారికీ ఆహ్వానాలు అందించేలా ఏర్పాట్లు జరుపుతామని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. corporator సామల హేమ, డిప్యూటీ కమీషనర్ రవికుమార్, ucd ప్రాజెక్ట్ అధికారి తిరుపతి, చర్చి పాస్టర్ రెడ్డి, నిర్వాహకులు, నేతలు పాల్గొన్నారు.