చంద్రబాబు రైతులకోసం ఆలోచిస్తున్నారు అంటే ఎవ్వరికైనా నవ్వు వస్తుంది. ఎందుకంటే అదే రైతులను మోసం చేసి తప్పుడు హామీలు ఇచ్చి గత ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన తరువాత చివరికి చేతులెత్తేశారు. దాంతో కొందరు రైతులు హాత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. అయినప్పటికీ కనీసం జాలి చూపించకుండా ప్రభుత్వాన్ని తన సొంత ప్రయోజనాలకే వాడుకున్నాడు తప్పా రాష్ట్ర ప్రలకు చేసింది ఏమీ లేదు. ఎవరైనా ఎదురు తిరిగితే పోలీసులతో కొట్టించేవాడు. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఉల్లి సమస్య ఎక్కువగా ఉంది. దీనిపై చంద్రబాబు ప్రభుత్వానికి ఏదోరకంగా చెడ్డ పేరు తెప్పించాలని చూస్తున్నాడు. దాంతో స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి సరైన సమాధానం ఇచ్చాడు. “ఉల్లి ధరలు పెరగడం దేశవ్యాప్త పరిణామం. దానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారే కారణమని యజమాని, బానిసలు గగ్గోలు పెడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుబజార్లలో కిలో 25 చొప్పున రాయితీ ధరకు ప్రభుత్వం విక్రయిస్తోంది. హెరిటేజ్ లో వంద లాభంతో కిలో 200కు అమ్ముతున్నారు” అని అన్నారు.
Home / ANDHRAPRADESH / హెరిటేజ్ లో వంద లాభంతో కిలో 200కు అమ్ముతున్నావ్..నువ్వు రైతులకోసం ఆలోచిస్తున్నావా !
Tags ap Chandrababu jagan politics tdp ysrcp