తెలంగాణతో పాటుగా యావత్తు దేశంలోనే సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం.. హత్య కేసుల్లో నిందితులైన ఆరీఫ్,శివ,చెన్నకేశవులు,నవీన్ లను పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా ఎన్కౌంటర్ చేసిన సంగతి విదితమే.
అయితే దిశ కేసులో మరో మలుపు తిరిగింది. దిశ కేసులో మరో కీలకమైన అంశం తెరపైకి వచ్చింది. ఆరిఫ్ ఇరవై ఆరు ఏళ్లుండగా .. శివ,నవీన్,చెన్నకేశవులకు ఇరవై ఏళ్లు ఉంటాయని సీపీ సజ్జనార్ ప్రకటించారు.
అయితే వారిలో ఇద్దరు మైనర్లున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు.ఎన్.హెచ్. ఆర్.సీ కిచ్చిన నివేదికలో వీరి తల్లిదండ్రులు పేర్కొన్నట్లు వార్తలు వస్తోన్నాయి. అయితే ఎన్ హెచ్ ఆర్సీ పై ఇంటబయట విమర్శల వర్షం కురుస్తున్న సంగతి విదితమే.