తెలంగాణతో పాటు మొత్తం దేశంలోనే సంచలన సృష్టించిన దిశ ఘటనలోని నిందితులైన నలుగురు సైబరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ లో మృతి చెందిన సంగతి విదితమే. సీన్ రీకన్ స్ట్రక్షన్ లో భాగంగా నిందితులను ఘటన ప్రదేశానికి తీసుకెళ్లారు.
ఈ క్రమంలో నిందితుల్లో ఇద్దరు పోలీసుల దగ్గర ఆయుధాలను లాక్కొని వారిపై కాల్పులు జరిపారు. మరో ఇద్దరు నిందితులు పోలీసులపై రాళ్ళు విసిరారు.దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు నిందితులు మృతి చెందారు.
అయితే చనిపోయిన దిశ నిందితులపై మరో కేసును పోలీసులు నమోదు చేశారు. పోలీసులపై హత్యాయత్నానికి ప్రయత్నించడం,పోలీసుల ఆయుధాలను అపహరింగారని పలు సెక్షన్ల కింద నిందితులైన ఆరిఫ్,శివ,నవీన్ ,చెన్నకేశవులు తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.