తెలుగు బుల్లి తెర ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన నటి హరితేజ. ఇక తాజాగా బిగ్ బాస్ షోతో మరింత పాపులర్ అయ్యింది. ఈ అమ్మడు ఇప్పుడు సినిమాలతో పాటు.. యాంకర్‌గా కూడా వరుస అవకాశాలను కొట్టేస్తుంది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో హరితేజ మాట్లాడుతూ.. ఇండస్ట్రీ కి ఎలా వచ్చింది.. ఏం అవుదామని వచ్చింది.. అనే విషయాల గురించి చెప్పుకొచ్చింది.
ఇకపోతే పదో తరగతి చదువుతున్న సమయంలో రవీంద్ర భారాతి లో ఒక ప్రోగ్రామ్ లో డాన్స్ చేసిందట, ఆ ఫొటోస్ ఒక సినిమా ఆఫీస్ వాళ్ళు చూసి సినిమాలో అవకాశం ఇచ్చారని చెప్పింది. కెరీర్ మొదట్లో అందరి బంధువయా సినిమాలో నటించిన హరి తేజ ఆ సినిమా తరువాత అనగనగా ఒక ధీరుడు,దమ్ము, అత్తారింటికి దారేది, నేనొక్కడినే, అ ఆ, డిజే, విన్నర్, రాజా ది గ్రేట్ చిత్రాల్లో నటించింది. మంచి డాన్సర్ అవుదామని అనుకున్న హరి తేజకు నటిగా చిత్ర పరిశ్రమలో మంచి పాత్రలు రావడంతో తాను సినిమాలవైపు మళ్లాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.