Home / ANDHRAPRADESH / మీ ఇంట్లో జరిగితే పవన్‌ ఇలాగే అంటారా..సిగ్గు చేటు

మీ ఇంట్లో జరిగితే పవన్‌ ఇలాగే అంటారా..సిగ్గు చేటు

యావత్‌ దేశాన్ని కుదిపేసిన షాద్‌నగర్‌ దిశ అత్యాచార ఘటనలో నిందితులకు రెండు బెత్తం దెబ్బలు చాలని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అనడంపై మరో ప్రముఖ నటుడు సుమన్ మండిపడ్డారు. మహిళలపై అత్యాచారం చేసిన వారికి రెండు దెబ్బలు చాలనటం దారుణమన్నారు. అలాంటి ఘటనలు వారింట్లో జరిగితే పవన్‌ ఇలాగే అంటారా అని ప్రశ్నించారు. సుమన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనల్లో బాధితుల ఆవేదనను అర్థం చేసుకుని మాట్లాడాలని పవన్‌కు హితవు పలికారు. అదే విధంగా అత్యాచార నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు పవన్‌ వ్యాఖ్యలపై మహిళలు, మేధావులు, రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. పవన్‌ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక దిశ ఘటనపై తిరుపతితో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వివిధ రాజకీయ పక్షాలు, లాయర్లు, డాక్టర్లు ఇందులో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు దిశా ఘటన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితులను నాలుగు దెబ్బలు వేస్తే సరిపోతుందని చెప్పటం పవన కల్యాణ్ సిగ్గు చేటని మండిపడ్డారు. ప్రజలంతా దిశ ఘటనలో నిందితులకు ఉరి వేయాలని అంటే, పవన్ కళ్యాణ్ భిన్నంగా మాట్లాడి విమర్శలకు గురి అయ్యారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat