తమ ఖాతాదారుల సొమ్మును కార్వి ట్రేడింగ్ తప్పుడు లెక్కలతో రియల్ ఎస్టేట్ రంగంలోకి మళ్లించిందని సెబి తనిఖీలలో వెల్లడైంనందున ప్రముఖ స్టాక్ మార్కెట్ బ్రోకింగ్ సంస్థ కార్వి ట్రేడింగ్ లైసెన్స్ ను జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సంస్థ సస్పెండ్ చేసింది. ఆ సంస్థ కు సంబందించిన అన్ని విభాగాలకు ఇది వర్తిస్తుందని ప్రకటించింది. సెబి మార్గదర్శకాలను ఉల్లంఘించిన నేపద్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఖాతాదారుల సెక్యూరిటీలను దుర్వినియోగం చేసినట్లు, ఇతర పెట్టుబడులకు నిదులు వినియోగించినందుకుగాను ఈ చర్యలు తీసుకొన్నట్లు సమాచారం. కొత్త ఖాతాదారులను తీసుకోకుండా సెబీ ఆంక్షలు విధించింది. అంతేకాదు.. ప్రస్తుతం ఉన్న ఖాతాదాలకు సంబంధించిన పవర్ ఆఫ్ ఆటార్నీపై కూడా ఆంక్షలు విధించింది. 1096కోట్ల ను కార్వి రియల్ ఎస్టేట్ రంగంలోకి మళ్లించిందని సెబి తనిఖీలలో వెల్లడైందని సమాచారం. ఖాతాదారులు తమ షేర్ల కు సంబంధించిన వివరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సెబి సూచించింది.
