రాహుల్ సిప్లిగంజ్.. బిగ్ బాస్3 రియాలిటీ షోతో చాలా పాపులర్ అయ్యాడు. బిగ్ బాస్ మూడవ సీజన్‌లో విన్నర్‌గా నిలిచాడు. తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి చేరువయ్యాడు . దీనికితోడు తన ప్రవర్తనతో, పాటలతో అనేకమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రేక్షకులకు, ఆదరించిన అభిమానులకు రాహుల్ ఇటీవలే లైవ్ మ్యూజికల్ కన్సార్ట్‌ను నిర్వహించి ఇలా తనకు ఓట్లు వేసిన వారికి అంకితం ఇస్తున్నానని చెప్పాడు. అది అలా ఉంటే రాహుల్ అదిరిపోయే చాన్స్ కొట్టాడు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో నటించే అవకాశం అందిపుచ్చుకున్నాడు. ఇదే విషయాన్ని రాహుల్ తన సోషల్ మీడియాలో ప్రకటిస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. డైరెక్టర్ కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మరాఠి సినిమా నటసామ్రాట్‌కు రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమాలో జాతీయ ఉత్తమ నటుడు ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ , కమెడియన్ బ్రహ్మనందంలు నటిస్తున్నారు. ఈ సందర్భంగా రాహుల్ వారందరితో కలసి నటించే అవకాశం దక్కించుకోవడం, తన అదృష్టంగా భావిస్తున్నాని తన ఆనందాన్ని వ్యక్తపరిచారుడు. తన విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్పాడు.