కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మున్సిపాల్టీని వైసీపీ నిలబెట్టుకుంది. మునిసిపల్ చైర్మన్గా రాజగోపాల్ అలియాస్ చిన్నా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసీపీ పార్టీకి 16 కౌన్సిలర్ లు ఉన్నప్పట్టికీ , తెలుగుదేశం పార్టీ ఈ మున్సిపాల్టీని స్వాదీనం చేసుకోవాలని ప్రయత్నం చేసింది. విజయవాడ ఎమ్.పి కేశినేని నాని, జగ్గయ్యపేట శ్రీరాం తాతయ్యలు రిటర్నింగ్ అదికారి ని ఎన్నికలు జరగనివ్వకుండా అడ్డుకున్నారు.తమ పార్టీ కౌన్సిలర్ లను కిడ్నాప్ చేశారని, వారు వచ్చే వరకు ఎన్నిక జరపరాదంటూ వారు గొడవ చేశారు. టిడిపి కార్యకర్తలను కూడా పెద్ద ఎత్తున సమీకరించి హడావుడి సృష్టించారు. దాంతో గంటల తరబడి వేచి చూసి ఆ తర్వాత ఎన్నికను వాయిదా వేశారు. ఇవ్శాళైనా సజావుగా జరుగుతుందా అన్న అనుమానం ఉంది. ఎట్టకేలకు జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ గా ఇంటూరి రాజగోపాల్ ను ఎన్నికైనట్లు ప్రకటించి ప్రమాణ స్వీకారం కూడా చేయించారు. వైసిపి కౌన్సిలర్లకు ఎన్ని ప్రలోభాలు వచ్చినా వారు ఆకర్షితులు కాకపోవడం విశేషం.
