తెలంగాణా లో ఓ వ్యక్తి ఎంఆర్ఓ పై కిరోసిన్ పోసి హతమార్చిన సంఘటన మారువకముందే ఏపిలో విజయనగరం జిల్లా ఎస్.కోట లో తండ్రి కూతుళ్లు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఆత్మహుతి కి ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది.తమ భూములు ఆక్రమించుకుంటున్నారని, ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో విజయనగరం జిల్లా ఎస్.కోట పట్టణం బర్మా కాలనీ వాసులైన తండ్రీ కూతుళ్లు ఆత్మహత్యాయత్నం చేసారు. బర్మా కాలనీలో గొర్లె అప్పారావు, తన కుమార్తె ప్రభకు కొంత భూమి ఉంది. కొంతకాలంగా ఆ భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారాని తమ భూమి పత్రాలను తమకు ఇప్పించాలిసిందిగా ఎంఆర్ఓ చుట్టూ ఎన్ని సార్లు తిరిగినా ఫలితం లేకపోయేసరికి తండ్రీ కూతుళ్లు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకోబోయారు. ఆఫీస్ ఆవరణ లోని సిబ్బంది వాళ్ళను నీళ్ళతో తడిపి పోలీసు వారికి పిర్యాదు చేయుట జరిగింది. పోలీసువారు తండ్రి కుతుళ్ళను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్ లో హల్ చల్ చేస్తుంది.