ప్రస్తుతం టీమిండియా సెలక్షన్ కమిటీకి ఇది చాలా తలనొప్పి తెప్పించే వ్యవహారమే అని చెప్పాలి. ఎందుకంటే ఇండియాలో ప్రస్తుతం యంగ్ స్టర్స్ ఎక్కువ అయ్యారు. వారి ఆట చూస్తుంటే మతిపోతుంది. ప్రత్యర్ధులను మట్టి కరిపిస్తున్నారు. ప్రత్యేకించి నిన్న సైయిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లో భాగంగా ముంబై, పంజాబ్ మధ్య మ్యాచ్ జరగగా ముందుగా బ్యాట్టింగ్ కు దిగిన ముంబై ఓపెనర్ పృథ్వి షా విరుచుకుపడ్డాడు. మరోపక్క పంజాబ్ నుంచి గిల్ కూడా తనదైన శైలిలో బ్యాట్ తో పరుగుల వరద పారించాడు. ఇలా మ్యాచ్ మొత్తం బౌండరీలతో హోరెత్తిపోయింది. ఇంక మరో ఆటగాడు పడికల్ విషయానికి వస్తే ఈ టోర్నమెంట్ లో లీడింగ్ రన్ స్కోరర్ అతడే. ఇలా యంగ్ స్టర్స్ ఆట చూస్తుంటే త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ లో తమ ఆటతో మంచి పేరు తెచ్చుకుంటారు అనడంలో సందేహమే లేదు.