తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రాజ్‌భవన్‌లో భారత రాజ్యాంగ 70వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్, హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్జిలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గాంధీ, అంబేడ్కర్ చిత్రపటాలకు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” మాతృభాష విలువ తగ్గించకుండా చూసేందుకు తాను తెలుగులో ప్రసంగిస్తాను అని సీఎం కేసీఆర్ తెలిపారు. రాజ్‌భవన్‌లో రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నందుకు గవర్నర్‌కు అభినందనలు. మనది డైనమిక్ రాజ్యాంగం, అనేక మార్పులు, చేర్పులకు లోనైంది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు రాజ్యాంగం అవకాశం కల్పిస్తోంది. మన రాజ్యాంగం 7 దశాబ్దలుగా పరిపుష్టంగా కొనసాగుతోంది. రాజ్యాంగ స్ఫూర్తితో మన కర్తవ్యాన్ని నిర్వహించుకుందాం. భారత రాజ్యాంగ స్ఫూర్తికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి అని” పిలుపునిచ్చారు.
Tags CM KCR constitution tamila syee soundar rajan