Home / ANDHRAPRADESH / వందల కోట్ల ఖర్చు, ప్రత్యేక విమనాలతో ఆడంబరంగా సీఎం రమేష్ కొడుకు నిశ్చితార్థం

వందల కోట్ల ఖర్చు, ప్రత్యేక విమనాలతో ఆడంబరంగా సీఎం రమేష్ కొడుకు నిశ్చితార్థం

బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కొడుకు నిశ్చితార్థం అంగరంగ వైభవంగా పెద్దఎత్తున డబ్బు ఖర్చుపెట్టి అత్యంత ఆడంబరంగా నిర్వహించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త తాళ్లూరి రాజకుమార్తె పూజతో సీఎం రమేష్ కొడుకు రిత్విక్ ఈ నెల 23న నిశ్చితార్థం దుబాయిలో భారత కాలమాన ప్రకారం ఆదివారం దుబాయిలో చేశారు. అయితే ఈ నిశ్చితార్థం కోసం సీఎం రమేష్ 15 ప్రత్యేక విమానాలు బుక్ చేశారట. సుమారుగా 100 మంది ఎంపీలు పదుల సంఖ్యలో మంత్రులు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ నేతలంతా దుబాయ్ వెళ్లి పోయారు. దుబాయ్ లో స్టార్ హోటల్ బుక్ చేసి మూడు రోజుల పాటు సంగీత పేరుతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపుగా నెల రోజుల పాటు ఏర్పాట్లు జరిగాయి దుబాయిలోని వాల్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా మాలో గ్రాండ్గా ఈ కార్యక్రమం జరిగింది.. సీఎం రమేష్ కూడా అత్తారింటికి దారేది సినిమా లో బాపు గారి బొమ్మ అనే పాటకు సతీమణితో కలిసి స్టెప్పులేశారు. కేవలం నిశ్చితార్థానికి ఏ వందల కోట్ల రూపాయలు సీఎం రమేష్ ఖర్చు చేసినట్టు అంచనాకు వస్తున్నారు. నిశ్చితార్థ కార్యక్రమాన్ని ఎన్ని వందల కోట్లతో చేస్తే ఇక పెళ్లి ఏ రేంజ్లో ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం మీద బిజెపి ఎంపీ సీఎం రమేష్ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సామాన్యులు అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat