తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు యువతికి భరోసాగా నిలిచారు. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేటకు చెందిన అంబటి బాలయ్యకు ఇద్దరు కూతుర్లు. కొడుకున్నారు. రెండో కూతురు (21)రజిత డిగ్రీ పూర్తిచేసి ప్రస్తుతం ఇంట్లోనే ఉంటుంది.
రజిత గత కొన్నాళ్లుగా నరాల బలహీనత వ్యాధితో బాధపడుతుంది. దీంతో సరిగ్గా నాలుగురోజుల కిందట తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో హైదరాబాద్ లోని ఉస్మానీయ దవఖానాకు తరలించారు. దీనికి చికిత్సకు రోజు రూ.యాబై వేల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు.
బాలయ్య తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటకు చెందిన టీఆర్ఎస్ నాయకులు బాబుకు సమస్యను వివరించాడు. దీంతో బాబు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాడు. సానుకూలంగా స్పందించిన మంత్రి ఆదేశించడంతో కేటీఆర్ నాలుగు రోజుల క్రితం నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్య ఖర్చుల కోసం రూ.2.50లక్షలను ఎల్వోసీని మంజూరు చేయించి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.