ఏపీలో టీడీపీకి అతి పెద్ద షాక్ తగలనుంది. ఇప్పటి వరకు వైసీపీలో గెలిచిన 20 మంది ఎమ్మెల్యేలను అడ్డదారిలో టీడీపీలోకి లాక్కున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కు ఒక నెల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన మాజీ సీఎం కుమారుడు నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.. మనోహర్ సమైక్యాంధ్రప్రదేశ్‌కు చిట్ట చివరి స్పీకర్‌గా పనిచేసారు..మనోహర్ కిందటి సాధారణ ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేసి 20 వేల పైచిలుకు ఓట్లను సాధించారు.. 2014 ఎన్నికల తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగయినా కూడా మనోహర్ కు నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది.. 2004, 2009 ఎన్నికల్లో తెనాలి నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మనోహర్ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు.
ఇక తెనాలి నుంచి వైసీపీ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అన్నాబత్తుని శివకుమార్ అక్కడ సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి ఆలపాటి రాజాకు సరైన ప్రత్యర్థికాదు. దీంతో అక్కడ వైసీపీ నుంచి మనోహర్ అయితే గట్టి ప్రత్యర్థి అవుతాడని జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనోహర్‌ను వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచి ఎమ్మెల్యే బరిలో దించాలని జగన్ నిర్ణయించారట.. ఇక రాజకీయంగా కాంగ్రెస్ లో ఉంటే పైకి ఎదగలేమని, మళ్ళి యాక్టీవ్ అవ్వాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనోహర్‌కు వైసీపీయే మంచి అవకాశంగా భావిస్తున్నారు. దీనికి తోడు వైఎస్ ఫ్యామిలీతో ఉన్న అనుబంధం నేపథ్యంలో కూడా ఆయన వైసీపీ జెండా కప్పుకునేందుకు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది.. అయితే ఇదివరకే జగన్ తో చర్చించిన నాదెండ్ల మనోహర్ పార్టీలో ఎంత త్వరగా చేరితే అంత మేలనే అభిప్రాయంలో ఉన్నారు అన్ని అనుకూలిస్తే వచ్చే నెల 4వ తేదీన వైసీపీ తీర్ధం తీసుకోనున్నట్టు ఇన్ సైడ్ టాక్..
source By Rajeswararao Konda