ఇప్పటివరకు తన పై ఎటువంటి కేసులు లేవని తాను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తారని ఇటీవల వైఎస్సార్సీపీలో చేరిన దేవినేని అవినాష్ వెల్లడించారు. లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా కచ్చితంగా వైసిపి అభ్యర్థులను గెలిపించి తీరుతాం అని పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తా అని చెప్పుకొచ్చారు. అయితే దేవినేని అవినాష్ పదవి కోసం అలాగే తన కేసుల మాఫీ కోసం వైసీపీలో చేరాలని కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శిస్తున్నారు దీనిపట్ల మాట్లాడుతూ తనపై ఇటువంటి కేసులు లేవని స్పష్టం చేశారు. వల్లభనేని వంశీ కూడా ఇప్పటికే టిడిపికి రాజీనామా చేశారని అవసరం అయినప్పుడు ఖచ్చితంగా టెక్నికల్‌గా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని తన ఉద్దేశం లో త్వరలోనే ఆయన వైసీపీలో చేరతారు అంటూ చెప్పుకొచ్చారు.
