మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనికాంత్, నయనతార నటిస్తున్న దర్బార్ సినిమా జనవరి 15న విడుదల చేయుటకు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసినదే, ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు ప్రేక్షకుల ను అలరిస్తున్నాయి. కానీ రజని చిత్రాని కంటే ముందుగా తెలుగులో మహేష్”సరిలేరునీకెవ్వరు”, బన్నీ “అల వైకుంటాపురంలో” చిత్రాలు విడుదల అయ్యే అవకాశం ఉన్నందున థియేటర్ల సమస్య ఏర్పడే అవకాశం ఉన్నదని భావించి దర్బార్ చిత్రాన్ని ముందుగానే జనవరి 9వ తేదీన విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. దీనిద్వారా తెలుగు రాష్ట్రాలలో కూడా అధిక వసూళ్లను వసూలు చేయవచ్చిని భావిస్తున్నారు. 9న విడుదల చేస్తే కొన్ని సెలవులు అదనంగా వసూళ్లకు కలిసొస్తాయని అంచనవేస్తున్నారు.దీనికి సంబందించిన అధికార ప్రకటన చిత్ర యూనిట్ నుండి రావాలిసిఉంది. రజని పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12 న దర్బార్ చిత్ర పాటలను విడుదల చేయాలని నిర్మాత మురుగదాస్ భావిస్తున్నారు.