తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన మహాబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ మాలోతు కవితకు కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీల్లో చోటు కల్పించింది.
కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన మానవ వనరుల అభివృద్ధి కమిటీలో సభ్యురాలిగా ఎంపీ మాలోతు కవితను నియమించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. సంపూర్ణ అక్షరాస్యత ,విద్యా సౌకర్యాలను మెరుగపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ విధివిధానాలను అమలు చేస్తుంది అని మానవ వనరుల కమిటీలో సభ్యురాలిగా స్థానం దక్కించుకున్న ఎంపీ కవిత తెలిపారు.
ఆమె ఇంకా మాట్లాడుతూ దేశంతో పాటుగా రాష్ట్రంలోని మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని మెరుగైన విద్యా సౌకర్యాలను కల్పిస్తానని ఆమె హామీచ్చారు. పార్లమెంట్ నియోజకవర్గంలో జవహార్ లాల్ నవోదయ విద్యాలయం,కేంద్రీయ విద్యాలయాల్లో మౌలిక వసతులు,ఇతర సమస్యల పరిష్కారం కోసం కృషి చేయనున్నట్లు ఎంపీ కవిత ఈ సందర్భంగా తెలిపారు.