తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫీజు చెల్లింపు గడవును మరోసారి పెంచారు. ఇప్పటికే గతంలో ఒక్కసారి పొడిగించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరోసారి పెంచింది. గతంలో పొడిగింపుతో నిన్న బుధవారంతో గడవు ముగిసింది.
తాజాగా ఈ నెల ఇరవై మూడో తారీఖు వరకు గడవు పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా రూ.50 ఆలస్య రుసుంతో ఈ నెల ఇరవై ఆరో తారీఖు వరకు ఫీజు చెల్లించవచ్చు అని అధికారులు ప్రకటించారు. అయితే విద్యార్థులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.