వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మేయర్ గుండా ప్రకాష్, గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. రాజ్యాంగంలో పొందుపరిచిన విద్య, వైద్యానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారు. గ్రంధాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. గ్రంథాలయ మౌలిక సౌకర్యాల కొరకు 1 కోటి 40 లక్షల నిధులను కేటాయించం. గ్రంధాలయాలను దేవలయలుగా తీర్చిదిద్దుతామని వినయ్ భాస్కర్ అన్నారు.
మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రంధాలయకు పూర్వ వైభవం తీసుకురావడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తరువాత గ్రంధాలయాలకు పుస్తకాలకు ప్రాముఖ్యత తగ్గింది. అందుకే డిజిటల్ లైబ్రరీలను అందుబాటులోకి తీసుకొచ్చాం. గ్రంధాలయం సంస్థకు కవల్సినన్ని నిధులు ఉన్నాయి. పాఠకులకు అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తాం. రాష్ట్రంలో ఉన్న గ్రంధాలయాలకు ఆదర్శనంగా నిలవాలని కడియం అన్నారు.