పునర్నవి భూపాలం- రాహుల్ సిప్లిగంజ్.. ఈ బిగ్ బాస్ జంటకు జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లో నటించిన పునర్నవి.. బిగ్ బాస్ కంటే ముందు తక్కువ మందికే తెలుసు. సినిమాల్లో పాటలు పాడే రాహుల్ సిప్లిగంజ్ కూడా జనాలకు పెద్దగా తెలియదు. బిగ్ బాస్ తెలుగు 3 వీరిని సెలబ్రిటీలను చేసింది. ఇక హౌస్లో వీరద్దరి కెమిస్ట్రీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పునర్నవి-రాహుల్ మధ్య ప్రేమాయణం జరుగుతోందని.. త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘అలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో అలీ అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పిందీ జంట. ఇందులో భాగాంగ తన ప్రేమాయణం గురించి పునర్నవి ఓపెన్ అయింది. తనను ప్రేమించిన వ్యక్తి చనిపోయినట్లు వెల్లడించి అందరికీ పెద్ద షాకే ఇచ్చింది. ఆ వ్యక్తి తనకు క్లోజ్ ఫ్రెండ్ అని.. తనను చాలా ఇష్టపడ్డాడని.. కెరీర్లో సెటిల్ కాకుండా పెళ్లి వద్దనే ఉద్దేశంతో తానే అతణ్ని దూరం పెట్టానని ఆమె చెప్పింది. ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీ అయ్యామని.. మధ్యలో కొన్ని విభేదాలు వచ్చాయని.. అదే సమయంలో తాను అమెరికాకు వెళ్లానని.. తాను వచ్చేసరికి ఈస్టర్ సందర్భంగా శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్లలో అతను చనిపోయాడని తెలిసి షాకయ్యానని పునర్నవి వెల్లడించింది. అతను తన మనసుకు బాగా దగ్గరైన వ్యక్తి అని.. మనిషి ఉన్నపుడు విలువ తెలియదని.. అతను తనకో జ్ఞాపకంగా మిగిలిపోయాడని.. అతను లేడనేసరికి కుంగిపోయానని చెప్పింది