ఏ ముహూర్తాన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ కృష్ణాజిల్లా గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ పలు వ్యాఖ్యలు చేశారో.. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. వంశీ మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ మునిగిపోయే నావ అని, ధర్మారెడ్డి సత్యం కూడా ఆ నావను పైకి తీసుకురాలేడు అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో ఎన్టీఆర్ మనవడు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే తెలుగుదేశం పార్టీని కాపాడుకోగలడని, ఎన్టీఆర్ చేతుల్లోకి వెళితే తప్ప తెలుగుదేశం పార్టీకి బతికే పరిస్థితి లేదన్నారు. అలాగే టిడిపిని బ్రతికించే శక్తి సామర్ధ్యాలు లోకేష్ కు లేవన్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి వంశీ మాట్లాడడం పట్ల తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు, పార్టీలోని కొందరు నాయకులు కూడా మాత్రం జూనియర్ ఎన్టీఆర్ చేతిలో పార్టీ పెట్టాలని అలా అయితేనే బాగుంటుందని అభిప్రాయానికి వచ్చేశారు. సోషల్ మీడియాలో కూడా తెలుగుదేశంపార్టీకి చెందిన నేతలు కూడా కొంతమంది ఇదే అభిప్రాయం వ్యక్త పరుస్తున్నారు. మొత్తంమీద వల్లభనేని వంశీ పెట్టిన చిచ్చు తెలుగుదేశం పార్టీలో లోకేష్ చంద్రబాబులు అయినటువంటి తండ్రి కొడుకులకు తీవ్ర సంకటంగా మారింది.
