తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా పరిధిలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గీసుగొండ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన పట్టాదారు పాసుబుక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులకు పట్టాదారు పాసుబుక్కులు ఎమ్మెల్యే అందచేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమావేశానికి వచ్చిన రైతుల వినతులు స్వీకరించి,తక్షణమే తగుచర్యలు తీసుగకోని రైతుల సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్ గారికి ఆదేశించారు.
ఈ సందర్భంగా మండలంలోని 243 మంది రైతులకు కొత్త పట్టాదారు పాసుబుక్కులు ఎమ్మెల్యే అందచేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల భూ సమస్యల నుండి విముక్తి చేయాలనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాదాబైనామా ప్రవేశపెట్టారన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మొదటిసారిగా సాదాబైనామ గురించి మాట్లాడినట్లు తెలిపారు.నియోజకవర్గంలో దాదాపుగా భూసమస్యలు పూర్తియైనట్లు వారు తెలిపారు.
ఇంకా కొంత శాతం పూర్తికావాల్సి ఉంది.రెవెన్యూ సిబ్బంది రైతులకు ఇబ్బంది కలగకుండా సమస్యలు తీర్చాలన్నారు.గ్రామాలలో రైతులకు ఏమైనా భూ సమస్యలు ఉంటే రైతు సమన్వయ సమితి దృష్టికి తీసుకెల్లాలన్నారు.రైతులను ఇబ్బందులకు గురిచేస్తే ఎవరికైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.సమస్య రైతులకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదేన్నారు.రెవెన్యూ అధికారులు గీసుగొండ మండలంలో ఛాలెంజింగ్ గా తీసుకొని పూర్తిస్థాయిలో భూ సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని,అందుకు రైతులు కూడా సహకరీంచాలని కోరారు.