క్రికెట్ ఆటలో క్యాచ్‌లు సర్వసాధారణం. గతంలో ఫీల్డర్లు తమ దగ్గరకు వచ్చిన క్యాచ్‌లను కూడా వదిలేవారు. కానీ.. ఇప్పుడలా లేదు. కొందరు ఫీల్డర్లు బౌండరీ లైన్ దాటుతున్న బంతులను కూడా క్యాచ్ పట్టి బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేస్తున్నారు. మరికొందరు దూరంగా వెళ్తున్న బంతులను కూడా గాల్లో డైవ్ కొట్టి మరి అందుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి క్యాచ్‌నే తాజాగా ఆస్ట్రేలియా ఆటగాడు కామెరాన్ వాలెంటే అందుకున్నాడు.
మార్ష్ వన్డే కప్‌లో భాగంగా విక్టోరియా-సౌత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. సౌత్ ఆస్ట్రేలియా తరపున ఆడుతున్న కామెరాన్ ఒంటిచేత్తో క్యాచ్ పట్టి ఈ మ్యాచ్‌లో అద్భుతం చేసాడు. విక్టోరియా ఇన్నింగ్స్‌లో భాగంగా 28 ఓవర్‌ను పేసర్ కేన్ రిచర్డ్సన్ వేశాడు. ఆ ఓవర్ ఐదో బంతిని హ్యాండ్స్కాంబ్ మిడ్ఆఫ్-ఎక్స్ ట్రా కవర్ మీదుగా భారీ షాట్ ఆడాడు. బంతి పైకి లేవగా.. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న కామెరాన్ పరుగెత్తుకుంటూ వచ్చి గాల్లో డైవ్ కొట్టి ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. దాంతో ఒక్కసారిగా హ్యాండ్స్కాంబ్ షాకయ్యాడు. ఈ క్యాచ్‌కు సంబందించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. క్రికెట్ అభిమానులు 25 ఏళ్ల కామెరాన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘సూపర్ మ్యాన్‌లా’ పట్టాడు అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. ‘వావ్ వాట్ ఏ క్యాచ్’ అని మరో అభిమాని కామెంట్ చేసాడు.
Catch of the summer? #MarshCup pic.twitter.com/tpJLaYghCq
— cricket.com.au (@cricketcomau) November 19, 2019