దివంగత ముఖ్యమంత్రి ఇ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు భార్య నందమూరి లక్ష్మీ పార్వతి ఏపీ ప్రభుత్వం ఇటీవల తెలుగు భాష చైర్మన్ పదవి ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఆమె కు కేబినెట్ హోదా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి జీవో కూడా జారీ చేసింది. ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి గతంలో తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేసింది. అంతకుముందు తెలుగు భాషకు సంబంధించి ఆమె ఎంతో ప్రావీణ్యం పొందింది. అయితే పదేళ్ల పాటు తెలుగుదేశం అధికారంలో ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న మరొకరు ముఖ్యమంత్రిగా ఉన్న ఎప్పుడు లక్ష్మి పార్వతిని ఎన్టీఆర్ సతీమణి గా భావించి కూడా ఏ ప్రభుత్వం కూడా ఆమెను గౌరవించలేదు.. న్యాయం చేయలేదు. జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల ఎన్టీఆర్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.