తెలంగాణ వ్యాప్తంగా గత నలబై ఐదు రోజులుగా ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఆర్టీసీ సిబ్బంది తమకు న్యాయం కావాలని తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మాకు కొన్ని పరిమితులుంటాయి. ఆ పరిమితులను మేము దాటలేము. రెండు మూడు వారాల్లోగా సమస్యను పరిష్కరించాలని కార్మిక శాఖ కమిషనర్ ను ఆదేశించగలము. కానీ ప్రభుత్వాన్ని ఆదేశించలేము..ఇందుకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేము. ప్రభుత్వంపై చర్యలు తీసుకోలేము అని తేల్చి చెప్పింది.