తెలంగాణ రాష్ట్రం ఖ్యాతి మరోకసారి ప్రపంచానికి పాకింది. వాణిజ్య పంటల్లో ప్రముఖమైన మిర్చి సాగులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం దేశ వ్యాప్తంగా 8.4లక్షల హెక్టార్లలో మిర్చి సాగవుతుంది.దీని ద్వారా 20.96లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి ఉత్పత్తి అవుతుంది.
అదే తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే మొత్తం 79.59వేల హెక్టార్ల సాగువిస్తీర్ణంతో నాలుగో స్థానంలో ఉంది. ఉత్పత్తిలో 3.98లక్షల మెట్రిక్ టన్నులతో రెండో స్థానంలో ఉంది.జాతీయ దిగుబడి సగటు 2.49టన్నులు అయితే తెలంగాణలో 5టన్నుల సగటుతో దేశంలోనే ముందు వరుసలో ఉంది.
ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి ఏటా రూ.305.64 కోట్ల విలువైన 33,960 మెట్రిక్ టన్నుల మిర్చిని వినియోగిస్తున్నారు.. మిగిలిన 3,63,990 మెట్రిక్ టన్నులను ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీనివల్ల రూ.3,275.91 కోట్ల ఆదాయం వస్తుంది.