ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన మంత్రి కొడాలి నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చెడుగుడు ఆడుకున్నాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ” ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని ఏమని పిలవాలో ఆ పార్టీ తరపున గెలుపొందిన నూట యాబై ఒక్క మంది ఎమ్మెల్యేలు కూర్చుని సమావేశమై సూచించాలని సలహా ఇచ్చిన సంగతి విదితమే. దీనిపై మంత్రి కొడాలి నాని తనదైన స్టైల్ లో స్పందించారు.
ఆయన మాట్లాడుతూ” ప్రముఖ సినిమా హీరో, జనసేన అధినేత అని చెప్పుకుంటూ తిరిగే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని ఏమని పిలవాలో మా పార్టీకి చెందిన నూట యాబై ఒక్క మంది ఎమ్మెల్యేలను కూర్చుని డిసౖడ్ చేసి చెప్పాలని చెబుతున్నారు. ముందు ఆయనను ఏమని పిలవాలో చెప్పమన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరపున బరిలోకి దిగి ఓడిపోయిన అభ్యర్థులందరూ ఒకచోట కూర్చుని పవన్ కళ్యాణ్ ను ఏమని పిలవాలో తేల్చి చెప్పాలని ఆయన సూచించారు. పవన్ కళ్యాణ్ కు వాళ్ల అమ్మనాన్న ఒకపేరు పెట్టారు.
సినిమాలోకి వచ్చాక ఆయన అన్నయ్య చిరంజీవి ఒక పేరు పెట్టారు. ఆయన అభిమానులు ఒక పేరు పెట్టారు. ఆయన వ్యతిరేకులు ఇంకో పేరు పెట్టారు. ఆయన్ని నడిపించే బాబు ఒక పేరు పెట్టారు. మా వైసీపీ వాళ్ళు ఒక పేరు పెట్టారు. ఏ పేరు పెట్టి పిలవాలో ముందు ఆయన తేల్చి చెప్పాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి అయిన జగన్ ను కొంతమంది వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అని పిలుస్తారు. ఇంకోంతమంది జగన్మోహాన్ రెడ్డి అని పిలుస్తారు. ఇంకా కొంత మంది జగన్ అని పిలుస్తారు. ఆయన అభిమానులు,ప్రజలు జగనన్న అని పిలుస్తారు. పిలిస్తే ఇలా పిలవాలి కానీ వైఎస్ జగన్మోహాన్ రెడ్డిలో మొదటిది మధ్యలోది వదిలేసి జగన్ రెడ్డి అని పిలుస్తానని అంటున్నాడు. అసలు ఆయనకు బుద్ధి ఉందా.. తింగర వేషాలు వేస్తే పళ్ళు రాలతాయని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు కొడాలి నాని.