Home / MOVIES / విక్రం- వేద‌.. రీమేక్‌లో రాణా- రవితేజ..?

విక్రం- వేద‌.. రీమేక్‌లో రాణా- రవితేజ..?

కోలీవుడ్‌లో కొద్ద‌రోజుల క్రితం విడుదలై సంచ‌ల‌న విజయం సొంతం చేసుకొన్న విక్రమ్ వేద చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారన్న విషయం తెలిసిందే. తొలుత ఈ సినిమా తెలుగు రీమేక్‌లో వెంకటేష్- రాణాలు నటించనున్నారనే వార్తలు వినిపించినప్పటికీ.. తాజా సమాచారం ఏంటంటే.. తెలుగు రీమేక్‌లో రవితేజ వేదగా నటించనున్నారని తెలుస్తోంది. సినిమాలో వేద క్యారెక్ట‌ర్‌ది పైకి నెగిటివ్ అండ్ పాజిటీవ్ షేడ్స్ ఉన్న హై ఓల్టేజ్ క్యారెట్ట‌ర్. తమిళ్‌లో విజ‌య్ సేతుప‌తి వేద క్యారెక్ట‌ర్‌లో ఇర‌గ‌దీశాడు. ఇక ఎనర్జీకి మారు పేరైన‌ రవితేజ ఆ పాత్ర పోషించ‌నుండ‌డంతో ఆ చిత్రం పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఇక ఆ చిత్రంలో మ‌రో సూప‌ర్ క్యారెక్ట‌ర్ విక్ర‌మ్‌.. త‌మిళంలో మాధ‌వ‌న్ పోషించిన ఈ పాత్ర‌లో యాక్షన్ అండ్ డిక్షన్‌కు కేరాఫ్ అడ్రెస్ లాంటి రాణా చేయ‌నున్నారు. దీంతో ఇద్ద‌రు బ‌డా స్టార్లు విక్రం-వేద‌ తెలుగు రీమేక్‌లో నటిస్తుండడంతో తెలుగులో రాబోయే క్రేజీయస్ట్ ప్రోజెక్ట్ గా సినిమా నిలవనుంది. ఈ కాంబినేషన్ కనుక నిజమే అయితే రవితేజ అభిమానులతోపాటు తెలుగు సినిమా అభిమానులకు కూడా ఈ ఇది శుభవార్తే. ఎందుకంటే విక్రమ్ వేద సబ్జెక్ట్ అలాంటిది. సస్పెన్స్ థ్రిల్లర్ అయిన ఈ చిత్రం వెండితెరపై మాత్రమే కాదు రీసెంట్‌గా బుల్లితెర పై కూడా సృష్టించిన సునామీ అలాంటిది. అయితే క్రేజీ కాంబినేషన్ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందో.. ఎప్పటికీ థియేటర్లలో దర్శనమిస్తుందో చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat