భారతదేశ తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి విదితమే. ఈ రోజు దేశ వ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు.
ఈ క్రమంలో టీఆర్ఎస్ మాజీ ఎంపీ ,తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ” మన పిల్లల ఆరోగ్యం మరియు శ్రేయస్సును విలువైనదిగా భావిద్దాం..
వారిని ఆదరించే సమాజాన్ని సృష్టిద్దాం. పిల్లలే మన వర్తమానం.. పిల్లలే మన భవిష్యత్ అని ఆమె పేర్కొన్నారు. పిల్లలు అభివృద్ధి చెందే సమాజాన్ని సృష్టిద్దామని “ఆమె పిలుపునిచ్చారు.