వికారాబాద్‌లోని అనంతగిరి హిల్స్‌ను టూరిజం, ఫారెస్ట్‌శాఖల ఆధ్వర్యంలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్టు టూరిజంశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు ఈనిర్ణయం తీసుకున్నట్టుతెలిపారు. ఈ ప్రతిపాదనలో భాగంగానే బుధవారం ఆయన మంత్రి సబితారెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అనంతగిరిహిల్స్‌లో వెలసిన అనంత పద్మనాభస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఇక్కడ పర్యటించారు.
ఈసందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ అనంతగిరిలో ఎలాంటి రోగాలైనా తగ్గిపోయే వాతావరణం ఉందని అన్నారు. ఈ ప్రాంతాన్ని తెలంగాణ ఊటీగా కూడా మార్చాలన్న ఆలోచన ఉందని మంత్రి పేర్కొన్నారు. అభివృద్ది చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సీం కేసీఆర్ ఆదేశాల మేరకే తాను ఇక్కడికి వచ్చినట్టుతెలిపారు. టెంపుల్ టూరిజం, వెల్నెస్టూరిజం, అడ్వెంచర్టూరిజంగా అభివృద్దిచేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. అనంతగిరిలో అన్నిరకాల జబ్బులు నయమయ్యే వాతావరణం ఉందన్నారు. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ కేబినెట్ సమావేశంలోనే అనంతగిరిని తెలంగాణ ఊటీగా అభివృద్దిచేయాలన్న తీర్మానం జరిగిందని తెలిపారు.