టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు,సి అశ్వనీదత్ ,పీవీపీ సంయుక్తంగా నిర్మించిన చిత్రం మహార్షి. ఈ చిత్రంలో పూజా హెగ్డే ,సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోయిన్ హీరోలుగా నటించారు. ఇదే ఏడాది మే నెల 9న విడుదలైన ఈ మూవీ సూమారు నూట ముపై కోట్లతో నిర్మితమై బాక్స్ ఆఫీసు దగ్గర రూ.170కోట్లను కొల్లగొట్టింది. అయితే ఈ చిత్రం తాజాగా మరో ఘనతను సొంతం చేసుకుంది. 2019 ఏడాదిలోనే ట్విట్టర్‌లో అత్యంత ప్రభావితం చేసే అంశాలలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్‌కి కృతజ్ఞతలు తెలియజేసింది.