Home / MOVIES / సినీ ఇండస్ట్రీల‌లో అలాంటి సంబంధాలే ఎక్కువ‌..!

సినీ ఇండస్ట్రీల‌లో అలాంటి సంబంధాలే ఎక్కువ‌..!

ప్రముఖ దర్శకనిర్మాత దివాకర్ బెనర్జీ తెరకెక్కించిన ఓయ్ లక్కీ లక్కీ ఓయ్ సినిమాతో రిచా చద్దా బాలీవుడ్‌లో అడుగుపెట్టిగా, అనురాగ్ కశ్యప్ చిత్రం ఫ‌క్రే, గ్యాంగ్స్‌ ఆఫ్ వ‌స్సేపూర్‌, మసాన్‌.. చిత్రాల్లోని ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. తాజాగా రిచా నటించిన జియా ఔర్ జియా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన్న రీచా కొన్ని ఆశ‌క్తిక‌ర విష‌యాలు చెప్పింది.

సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పేరు ప్రఖ్యాతుల కోసం సూపర్ స్టార్లు, క్రికెటర్లతో సంబంధాలు పెట్టుకోవాలని ఒకరు సూచించారంటూ ప్రముఖ బాలీవుడ్ న‌టి రిచా చడ్డా సంచలన వ్యాఖ్యలకు తెరలేపింది. అయితే అందుకు తాను అంగీకరించలేదని తెలిపింది. నేను ఇండస్ట్రీలో అడుపెట్టాక పర్సనల్ అసిస్టెంట్ ఒకరు ఫలానా నటుడికి టెక్ట్స్ మెసేజ్ పంపించి, ఆ హీరోతో డేటింగ్ చేయమని కోరాడు.

అనే తాను అతనికి పెళ్లయింది కదా.. అని ప్రశ్నించ‌గా.. మీ పబ్లిక్ ఇమేజ్‌కు, పబ్లిక్ రిలేషన్స్‌కు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంని అతడు తనకు సలహా ఇచ్చాడని, అయితే తానెప్పుడూ డేటింగ్ జోలికి వెళ్లలేదని పేర్కొంది. ఇక బయట నుంచి సినీ పరిశ్రమలోకి వచ్చిన వారికి ఇటువంటి అనుభవాలే ఎదురవుతాయని, తనకు ఇటువంటివి ఇష్టం లేకపోవడం వల్లే ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది స్నేహితులు ఉన్నారని వివరించింది. ఇండస్ట్రీలో అందరితో సంబంధాలు ఉండాలి కానీ, అవి ఈ తరహావి మాత్రం కాకుడదంటూ షాకింగ్ విష‌యాలు చెప్పింది రిచా.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat