టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ తాజాగా నటిస్తోన్న మూవీ డిస్కో రాజా . ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మాణంలో ముగింపు దశలో ఉంది. దీని తర్వాత తన ఆరవై ఆరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మాస్ మహారాజ్ రవితేజ.
గతంలో డాన్ శీను,బలుపు లాంటి బంపర్ హిట్లను అందించిన ప్రముఖ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సరస్వతి ఫిల్మ్ డివిజన్ పతాకంపై బి మధు నిర్మిస్తున్న చిత్రంలో రవితేజ నటించనున్నారు.
శృతిహాసన్ మెయిన్ హీరోయిన్ గా ఎంపిక కాగా వరలక్ష్మీ శరత్ కుమార్ ,సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తుండగా ఈ చిత్రం షూటింగ్ రేపు గురువారం ప్రారంభం కానున్నది అని చిత్రం యూనిట్ తెలిపింది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ లో రవితేజ గన్ పట్టుకుని పోలీస్ గెటప్ లో ఉన్న పోస్టర్ను చిత్రం యూనిట్ విడుదల చేసింది.