మీరు ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా..?. మరి ముఖ్యంగా మోకాళ్ల నొప్పులంటూ.. కీళ్ల నొప్పులంటూ తెగ పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా..?. అయితే వాటిని వాడటం వలన చాలా దుష్ప్రభవాలు ఉన్నాయనంటున్నారు పరిశోధకులు.
వయసు మళ్లిన వాళ్లు ,మిడిల్ వయసులో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ రకమైన మాత్రలను వాడుతుండటం మనం గమనిస్తూనే ఉన్నాము. అయితే ఈ మాత్రలు ధీర్ఘకాలంలో నొప్పిపై అంతగా ప్రభావం చూపవని పరిశోధకులు చెబుతున్నారు.
అదే సమయంలో శరీరంపై తీవ్రమైన దుష్ప్రభావాలు కూడా ఉంటాయని వారు అంటున్నారు. అయితే అత్యవసరమైతే తప్పా ఈ రకమైన మాత్రలను వాడకూడదు అని వారు హెచ్చరిస్తున్నారు. మొత్తం పన్నెండు వేల మందిపై అధ్యయనం అనంతరం ఈ వివరాలను తెలిపారు. మాత్రల కన్నా యోగ,వ్యాయామం,కాచుకోవడం లాంటి వాటి వలన ప్రభావం ఎక్కువగా ఉంటుందని వారు చెబుతున్నారు.