Home / ANDHRAPRADESH / రివర్స్ టెండరింగ‌్‌ ద్వారా ప్రభుత్వానికి ఎన్ని వందల కోట్లు ఆదా అయ్యాయో తెలుసా..?

రివర్స్ టెండరింగ‌్‌ ద్వారా ప్రభుత్వానికి ఎన్ని వందల కోట్లు ఆదా అయ్యాయో తెలుసా..?

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదేళ్లలో పోలవరంతో సహా పలు సాగునీటి ప్రాజెక్టులతో పాటు, ప్రభుత్వ పనుల్లో భారీగా అవినీతి జరిగిందని భావించిన సీఎం జగన్ రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం సత్ఫలితాలను ఇస్తోంది. రివర్స్ టెండరింగ్‌పై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎన్ని విమర్శలు చేసినా లెక్క చేయకుండా ప్రభుత్వం ముందుకు వెళ్లింది. దీంతో ఒక్క పోలవరం డ్యామ్ పనుల్లోనే రూ. 841.33 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యాయి. ఇక గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామవాలంటీర్లు ప్రజలకు సేవలు అందించేందుకుగాను వారికి 4జి సిమ్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ప్రభుత్వం 199 రూపాయల బేసిక్ 4జి ప్లాన్ సిమ్స్ కొనుగోలుకు రివర్స్ టెండరింగ్‌కు ప్రభుత్వం వెళ్లింది. మొత్తం 121.54 కోట్లకు ప్రభుత్వం బిడ్ దాఖలు చేయగా…రివర్స్ టెండర్ లో 87.77 కోట్లకు ఎల్-వన్ బిడ్ దాఖలు చేసింది. రూ. 199 నెలవారీ ప్లాన్ ను రూ. 92.04/- కే ఇచ్చేందుకు ఎల్‌-వన్ సంస్థ ముందుకు వచ్చింది. రివర్స్ టెండర్ తో ఒక్కో సిమ్ పై నెలకు రూ.107 ఆదా అయింది. మూడేళ్ల కలపరిమితితో మొత్తం రెండు లక్షల 64వేల 920 4జి సిమ్ ల కొనుగోలు చేసింది. మొత్తంగా సిమ్ కార్డుల కొనుగోలులో రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని అమలు చేయడంతో రూ.33.77 కోట్ల ప్రజాధనం ఆదా అయింది. అలాగే కంప్యూటర్‌లు, ప్రింటర్‌ల కొనుగోలులో కూడా రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి రూ. 65.47/- కోట్లు ఆదాఅయ్యాయి. పోలవరం తర్వాత మరో ప్రధాన ప్రాజెక్టు వెలిగొండ నిర్మాణ పనుల్లో కూడా ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు వెళ్లింది. వెలిగొండ రెండో టన్నెల్ ప్రాజెక్ట్‌లో రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి రూ.61.74 కోట్లు ఆదా అయ్యాయి. ఇక ప్రధాన విద్యుత్ సంస్థ జెన్‌కో బొగ్గు రవాణా, పర్యవేక్షణలో రివర్స్ టెండరింగ్‌‌కు వెళ్లడంద్వారా రూ. 211 కోట్లు అయ్యాయి. మొత్తంగా రివర్స్ టెండరింగ్ ద్వారా 2019, నవంబర్ 10 నాటికీ ప్రభుత్వానికి ఆదా అయిన సొమ్ము అక్షరాలా..రూ. 1213.33/- కోట్లు. చూశారుగా మొత్తంగా సీఎం జగన్ తీసుకున్న రివర్స్ టెండరింగ్ విధానం విజయవంతం కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat